డా. ఆలూరి. విజయలక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సెప్టెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లోని త్యాగరాయగానసభ, కళాసుబ్బారావు కళావేదికలో విశ్వసాహితి, లేఖిని, త్యాగరాయగానసభ శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో జరిగింది. వేదగిరి రాంబాబు సంచాలకులుగా వ్యవహరించిన ఈ సభకు పోతుకూచి సాంబశిరావు అద్యక్షత వహించారు. పోరంకి దక్షిణామూర్తి ముఖ్య అతిధిగా కళా వేంకటదీక్షితులు, విరించి, వాసాప్రభావతి, చంథ్రేఖర ఆజాద్, రాజారామ్మోహనరావు, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి అద్దేపల్లి నరసింహారావు, కె.వి. ప్రసాదవర్మా వక్తలుగా పాల్గొన్నారు. సభకు హాజరైన లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యకక్షులు డా. జయప్రకాష్ నారాయణ్ సంస్థల తరుపున డా. ఆలూరి దంపతులను సత్కరించారు.