మంత్రి కృష్ణమోహన్‌కు పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం మంత్రి కృష్ణమోహన్‌కు 'ప్రవహించే పాదాలు మరియు ఇతర కవితలు' కవితా సంపుటికి 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మంత్రి కృష్ణమోహన్‌ గతంలో 'మట్టి పలకలు' కవితా సంపుటి వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం 23 భాషలకు చెందిన యువ రచయితలకు పురస్కారాలు ప్రకటించింది. కవిత్వం, కథ, విమర్శ ప్రక్రియలను పరిశీలనకు తీసుకున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురస్కారాన్ని త్వరలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నట్లు అకాడమీ ప్రతినిధి కె. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. యాభై వేల రూపాయల నగదును పురస్కారంగా మంత్రి కృష్ణమోహన్‌కు అందజేస్తారు.