సాహిత్య అకాడెమీ గుర్తించిన 24 భారతీయ భాషల నుండి యువ పురస్కార్ 2014 గాను రచయితలు మరియు పుస్తక ప్రకాశకుల నుండి పుస్తకాలను ఆహ్వానిస్తున్నారు. రచయితల వయో పరిమితి జనవరి 1,2014 నాటికి 35 సంవత్సరాలు నిండి వుండకూడదు. ఈ బహుమతికి గాను రూ. 50,000 నగదు ఇవ్వడము జరుగుతుంది. పుస్తకముతో పాటు జన్మధృవీకరణ పత్రం ఖచ్చితంగా జతపరచి ఆఖరి తేది అనగా అక్టోబర్ 15, 2013 లోపన ఆఫీసర్ ఇన్‌చార్జ్, సాహిత్య అకాడెమీ, సెంట్రల్ కాలేజి క్యాంపస్, డా|| బి.ఆర్. అంబేద్కర్ వీధి, బెంగళూరు - 560 001 విలాసమునకు పంపాలి. ఇతర వివరములకు గాను www.sahitya-akademi.gov.in సంప్రదించగలరు.