కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డా|| సి. భవానీదేవితో 'కవిసంధ్య' కార్యక్రమం

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కేంద్రసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్‌22న ప్రముఖ కవయిత్రి డా|| సి. భవానీదేవి 'కవిసంధ్య' కార్యక్రమం జరిగింది. భవానీదేవి తన నలభై ఏళ్ళ సాహితీ వ్యాసంగంలో వెలువరించిన పది కవితా సంపుటాల్లోంచి కవితాగానం చేశారు. పలు అంశాలపై లోతైన భావసాంద్రతతో కూడిన ఈ కవిత్వంలో స్త్రీ పరమైన వేదన, పుస్తకం, పాపికొండల పాట, కెరట నా కిరీటం, అక్షరం, నా అస్తిత్వం, రైలు డ్రైవర్‌, ఉద్యోగిని దినచర్య, ఒక సౌందర్య దుఃఖగీతం, వర్ణనిశి, వంటి వైవిధ్యభరితమైన ఇతివృత్తాలపై రచించిన భావావేశం ఉంది. కవిత్వపఠనానంతరం జరిగిన సదస్సులతో ఇష్టాగోష్టిలో సాహిత్యాభిమానులడిగిన ప్రశ్నలకు కవయిత్రి బదులిచ్చారు. తన కవిత్వ అంతస్సూత్రాన్ని వివరించారు. తాను ప్రధానంగా మానవతావాదిననీ, తన పరిశోధనాంశంలో తెలుగు హిందీ కవుల కవిత్వాలలో భారతీయాత్మలోని ఏకసూత్రత నిరూపించాననీ, అన్ని ప్రక్రియలు చేపట్టినా తన అంతశ్చేతన కవిత్వమేనని వివరించారు. కవిత్వం రాత్రికి రాత్రి సమాజాన్ని మార్చులేదుగానీ ఆ దిశలో ఆలోచనను కల్గిస్తుందని చెప్పారు.గంటన్నర పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమీ బెంగుళూరు ఆఫీసర్‌ - ఇన్‌ఛార్జి ఎస్‌.పి. మహాలింగేశ్వర్‌, అకాడమీ తెలుగు విభాగం సంచాలకులు ఆచార్య ఎన్‌.గోపి నగరంలోని ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు.

విశాఖపౌర గ్రంధాలయంలో నవంబర్‌ 13న అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కళాప్రపూర్ణ పురిపండ అప్పలస్వామి సాహితీ పురస్కారం స్వీకరించిన ప్రముఖ సాహితీవేత్త, అనువాదకులు,  ఎల్‌ఆర్‌ స్వామి. ఈ కార్యక్రమంలో ఎడమ నుండి ఎస్‌.ఎమ్‌. ఇక్బాల్‌, గౌతమ్‌, మాజీ శాసన సభ్యులు, మానం ఆంజనేయులు, జె. వి. సత్యనారాయణమూర్తి,  అడపారామకృష్ణ, చందు సుబ్బారావు, వెలమల సిమ్మన్న, సి అనంతరావు మున్నగువారు పాల్గొన్నారు.

గుంటూరులో డిసెంబర్‌ 5న జరిగిన వైహెచ్‌కె.మోహనరావు పుస్తకం 'అక్షరస్వరాలు' గేయసంకలనం ఆవిష్కరణ సభ. చిత్రంలో పున్నాకృష్ణమూర్తి, బి. హనుమారెడ్డి, పొన్నూరు వేంకట శ్రీనివాసులు, పెనుగొండ లక్ష్మీ నారాయణ, ఎ. జయప్రకాష్‌, వడలి రాధాకృష్ణ, గద్దె రామతులశమ్మ, పి.వి. రమణ, యస్‌.వి.యస్‌. లక్ష్మీ నారాయణ

ఆదిలాబాద్‌ జిల్లా, మంచిర్యాలలో విశ్వనాధ ఆలయ కాలక్షేప మండపంలో డిసెంబర్‌ 8న  తోకల రాజేశం రచించిన సాహిత్య వ్యాసాల సంకలనం ''పాతళ గరిగె'' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య. చిత్రంలో నందిని సిద్ధారెడ్డి, తోటపల్లి భూమన్న, గోపగాని రవీందర్‌, రచయిత తోకల రాజేశం

నిజామాబాద్‌ జిల్లా మునిపల్లి గ్రామంలో ఇందూరు అపురూప అవార్డ్స్‌ 2013 ప్రదానోత్సవ సభ. ఈ సందర్భంగా వెలువరించిన ''అభినందన'' సంచికను ప్రముఖ నవలా రచియత డా|| కేశవరెడ్డి ఆవిష్కరించారు. చిత్రంలో ఎడమ నుండి స్వాతి ప్రసాద్‌, బాల చూడాలలిత, నెల్లూట్ల రమాదేవి, ఎనిశెట్టి శంకర్‌, డా|| కేశవరెడ్డి, కొండవీటి సత్యవతి, అమృతలత, డా|| ఎన్‌. గోపి, తుర్లపాటి లక్ష్మి, మేక రామస్వామి.

విశాఖపౌర గ్రంధాలయంలో నవంబర్‌ 13న అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కళాప్రపూర్ణ పురిపండా అప్పలస్వామి సాహితీ పురస్కారం స్వీకరించిన ప్రముఖ సాహితీవేత్త, అనువాదకులు ఎల్‌ఆర్‌ స్వామి. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఎమ్‌. ఇక్బాల్‌, గౌతమ్‌, మాజీ శాసన సభ్యులు ' మానం ఆంజనేయులు, జెవి. సత్యనారాయణమూర్తి, అడపారామకృష్ణ, చందు సుబ్బారావు, వెలమల సిమ్మన్న, సి అనంతరావు మున్నగువారు పాల్గొన్నారు.

నవంబర్‌ 9న  వైయస్‌ఆర్‌ కడప జిల్లాలోని జమ్మలమడుగులో ముద్దనూరు రోడ్డు సాయిబాబా దేవాలయం ధ్యానమందిరంలో పూల చలపతి ఆధ్వర్యంలో సింహపురి సాహితీ సమాఖ్య పర్యవేక్షణలో జరిగిన కవి సమ్మెళనంలో ప్రసంగిస్తున్న  సింహపురి సాహితీ సమాఖ్య కార్యదర్శి గుర్రాల రమణయ్య. చిత్రంలో కేంద్రసాహిత్య సలహామండలి సభ్యులు రాచపాలెం చంథ్రేఖర్‌ రెడ్డి, సింహపురి సాహితీ సమాఖ్య అధ్యకక్షులు గణపం రాజగోపాల్‌రెడ్డి, పూల చలపతి ఉన్నారు. 

ప్రముఖ రచర ుత్రి విజయలక్ష్మి పండిట్‌ అనువదించిన ఠాగూర్‌ గీతాంజలి 'అపూర్వ గానం' పుస్తకావిష్కరణ దృశ్యం