విరాళం

సాహితీస్రవంతికి   భూరి  విరాళం
విజయనగరం జిల్లా సాహితీస్రవంతి అధ్యక్షులుపి.ఎస్‌. శ్రీనివాస రావు సాహితీస్రవంతికి వారి తండ్రి పాణంగిపల్లి రామారావు జ్ఞాపకార్థం లక్ష రూపాయలు విరాళం అందజేశారు.
విశాఖపట్నంకు చెందిన శ్రీమతి కోన ఉమాదేవి, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, సాహితీస్రవంతికి రూ.25,000 లు (ఇరవై ఐదువేల రూపాయలు) విరాళంగా అందించారు.
విశాఖపట్నంకు చెందిన అయ్యగారి సీతారత్నం రూ.5000 లు సాహిత్య ప్రస్థానం పత్రికకు విరాళంగా అందించారు. వీరందరికీ , సాహితీ స్రవంతి, సాహిత్య ప్రస్థానం పత్రిక తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
2000 సంవత్సరం నుండి నిరాటంకంగా సాహితీస్రవంతి ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం మాసపత్రిక వెలువడుతున్న సంగతి తెలిసిందే. పాఠకులు, అభిమానులు సహకారం వల్లనే ఇది సాధ్యమయింది. ఆర్థికంగా భారం అయినప్పటికీ జనవరి 2018 సంచిక నుండి సాహిత్య ప్రస్థానం మాసపత్రిక పేజీలను పెంచడం జరిగింది. సాహిత్య పత్రికల నిర్వహణ  గురించి తెలుగు సాహిత్య అభిమానులకు తెలిసిందే. ప్రతీనెలా సంచిక వెలువరించడం  ఎప్పటికప్పుడు దినదిన గండమే. అయినా సాహిత్యం పట్ల, తెలుగు భాషపట్ల ఆపేక్ష కలిగిన పాఠకాభిమానుల ప్రోత్సాహమే మాకు బలం. సాహితీ స్రవంతి కార్యకలాపాలు నిరంతరంగా సాగాలన్నా, సాహిత్య ప్రస్థానం మాసపత్రిక నిరాటంకంగా వెలువడాలన్నా ఈ ప్రోత్సాహం చాలా అవసరంగా భావిస్తున్నాం. ఈ ఒరవడి మరికొందరికి ప్రేరణ కలిగిస్తుందని, సాహిత్యాభిమానులు స్పందించి తమ ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాహిత్య ప్రస్థానం మాసపత్రిక ఖాతా వివరాలు తొలిపేజీలో ఇవ్వడం జరిగింది. గమనించగలరు.