వచన కవితకు ప్రసిద్ధ కవి కుందుర్తి ఆంజనేయులు విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రత్యేక కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన నెలకొల్పిన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారాన్ని ప్రతీ సంవత్సరం వారి కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ పురస్కారాన్ని 2012 సంవత్సరానికి రామాచంద్రమౌళి 'అంతర' కవితా సంపుటికి, 2013 సంవత్సరానికి గాను ఈతకోట సుబ్బారావు 'చీలిన మనిషి' కవితా సంపుటికి ప్రకటించినట్లు శీలావీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి1న హైదరాబాద్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఈ పురస్కార ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ అవార్డు బహుకరణ కార్యక్రమంలో నగ్నముని, నాళేశ్వరం శంకరం, శిఖామణి, యాకూబ్, కుందుర్తి శాంత తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.