భద్రాచలం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో అభయాంజనేయస్వామి పార్కులో జనవరి 1న నూతన సంవత్సర సందర్భంగా కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మాగంటి సూర్యం మాట్లాడుతూ సాహితీస్రవంతి గత 12 సంవత్సరాలుగా భద్రాచలంలో సాహిత్యవాతారణం నెలకొల్పడంలో ఎంతో కృషిచేసిందని కొనియాడారు. జి. శంకరరావు మాట్లాడుతూ సాహిత్యం సామాజిక స్ఫూర్తితో, ప్రజాస్వామికంగా సాగాలని సాహితీస్రవంతి ఆ దిశగా కృషిసల్పుతుందని అన్నారు. ఈ సభలో సూర్యనారాయణ, తంగేటి కృష్ణ, జి. ప్రభావతి, భూపతిరావు, నరేంద్ర, రాము, ఆర్. సతీష్; సుబ్బరాజు, కృష్ణ తదితరులు తమ సహకారాలందజేస్తామని తెలిపారు. బి.జె.ఎల్.పి. దాసు, సిహెచ్. తిరుపాలు, శ్రీథిరాల వెంకటాచారి, వీధుల రాంబాబు, శ్రీహరి కామేశ్వరరావు, జి. రామరాజు, తాతోలు దుర్గాచారి, బి. తిరుపతయ్య, శ్రీలత, బి. స్వరూప, టి. అనుష, తదితర కవిగాయకులు స్వీయ కవితలు, గేయాలు ఆలపించారు.
సాహిత్య సంక్రాంతి
సంక్రాంతిని పురస్కరించుకుని నెలనెలా వెన్నెల కార్యక్రమంలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో భధ్రాచలంలో జనవరి 12న కవిగాయక సమ్మేళనము, నేటికథ-తీరుతెన్నులు చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ కథా సాహిత్యం సమకాలీన సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనే సాగుతుందని అన్నారు. కవిగాయక సమ్మేళనంలో సి. నాగేంద్రప్రసాద్, జి. తులసీదాస్, శ్రీథిరాల వెంకటాచారి, చిగురుమళ్ళ శ్రీనివాస్, తాతోలు దుర్గాచారి, వీధుల రాంబాబు, టి.వి. చలం, సూర్యనారాయణ, దాసు, ఆర్.ఎస్. రావు, శ్రీలత తదితరులు సంక్రాంతిపై కవితలు వినిపించారు. జి.ఎస్. రావు, తిప్పన సిద్ధులు, ధనంజయుడు ప్రసంగించారు. శ్రీకృష్ణ, భూపతిరాజు, తిరుపతయ్య, రాము, మనస్విత, విజయ, నాహారిక, విజయలక్ష్మి, స్వరూప చంద్రకళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాహితీస్రవంతి కార్యాలయం ప్రారంభం
జనవరి 15న భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో భగవాన్ స్వీట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో సాహితీస్రవంతి కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ప్రముఖ కవి సీరాల అప్పారావు రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. సమాజహితాన్ని కోరేదే సాహిత్యమని, సాహిత్య వాతావరణాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నెలకొల్పుతున్న సాహితీస్రవంతి మరిన్ని ప్రజాసాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు ఈ కార్యాలయం తోడ్పడాలని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సాహిత్యవేత్త భద్రాచలం సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు మాల్యశ్రీ మాట్లాడుతూ సాహితీస్రవంతి సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని అన్నారు. జి. శంకరరావు, వి. కృష్ణ, తాతోలు దుర్గాచారి, వీధుల రాంబాబు, జి. రామరాజు, ప్రభాకరరావు, తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
- తాతోలు దుర్గాచారి