కె. వరలక్ష్మికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం

ప్రముఖ కథా రచయిత్రి కె. వరలక్ష్మికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం లభించింది. జనవరి 20న హైదరాబాద్‌లో రవీంధ్రభారతిలో ఈ పురస్కారాన్ని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా.సి. నారాయణ రెడ్డి ఆమెకు అందజేశారు. సుశీలా నారాయణ రెడ్డి, రసమయి సంస్థ ఈ పురస్కారాన్ని ఇప్పటికి ముప్పై మంది రచయిత్రులకు అందజేయడం ప్రశంసనీయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవ హక్కుల కమీషన్‌ ఛైర్మన్‌ డా. సుభాషణి రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల  అట్టడుగు ప్రజల జీవితాలను వరలక్ష్మి సజీవంగా చిత్రించారని అన్నారు. 'అతడు-నేను', 'మట్టి-బంగారం' కథా సంపుటాలలోని కథలను విశ్లేషిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షత వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డా. ఎల్లూరి శివారెడ్డి, అరబిందో ఫార్మాసిటికల్స్‌ అధినేత వరప్రసాద్‌ రెడ్డి, పురస్కార ఎంపిక కమిటీ సభ్యురాలు డా. సి.ఆనందారామం తదితరులు రచయిత్రిని అభినందిస్తూ మాట్లాడారు.