గంగ నుండి ఓల్గాకు..

కవిత

   - డా.దిలావర్‌ - 9866923294


మనమంతా బంధువులం!

ఆహా! ఏమి ప్రవచనాలండీ!

ఎవరికి ఎవరు బంధువులు?

ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళు

పై కులపోళ్ళకు పై కులపోళ్ళు!

మరో తేనె పూసిన అభిభాషణ-

పవిత్ర గంగా నది బిందువులం!

ఎంత శ్రవణ పేయ సమాహితమండీ!

ఎంత మసిపూసి మారేడు గాయ చేసే ధర్మ సమ్హితండీ!

గంగా కూలంకషను కలుషితం చేసింది చాలు....

నిజానికి మనం కాళియ మడుగులో విరజిమ్మిన

కాల కూట విష బిందువులం!

బతికుండగానే మనుషుల్ని పీక్కు తినే రాబందులం!

ఓ పక్క అంతరిక్షానికి రెక్కలు కట్టుకుంటున్న విజ్ఞానం

మరోపక్క పాతాళానికి దిగ జారుతున్న మత మౌఢ్యం!

ఎన్నాళ్ళీ అసమ సమీకరణలు ?

మనిషికీ మనిషికీ మధ్య  అగాధాల్లా

విష దష్ట్రలు చాపే కర కుల ఘాతుకాలు

నువ్వు ఒక్క సారి ఓల్గా పరీవాహక నాగరికతవై

గతం లోకి ప్రవహించు......

అక్కడ మనుగడకు వేటాడటం తప్ప

మనుషుల్ని విభజించి వేటాడటం ఉందదు

స్త్రీ మూర్తిని ఒక చిన్న అంగంగా భావించి

కుంచించుకు పోవడం ఉండదు....

అక్కడ మాత స్వామ్యం

మానవ పునరుత్పత్తిని స్వేఛ్ఛగా స్వప్నించే మాత క!

కుటుంబ మహా వ క్షమై

ప్రాణ వాయువులందించే జీవన వాహిక!

మళ్ళీ మన మహా ప్రస్థానం

గంగ నుండి ఓల్గాకు సాగించుదామా.....