ఎల్‌.ఐ.సి. ఉద్యోగుల లలిత కళా సమితి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం

మార్చి4న ఎల్‌.ఐ.సి. జోనల్‌ ఆఫీసు, హైదరాబాద్‌ ప్రాంగణంలో ఎల్‌.ఐ.సి. ఉద్యోగుల లలిత కళా సమితి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం. హిందీ, తెలుగు సినీ గీతాలాపాన, డాన్స్‌, ఫ్లూట్‌ వాయిద్యము తదితర కార్యక్రమాలు ఆద్యంతము ప్రేక్షకులను అలరించాయి. ముఖ్య అతిథిగా ఎ.కె. సాహుగారు, జోనల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ విచ్చేసి కళాకారులను సత్కరించారు. ఫొటోలో వరుసగా (ఎడమనుంచి కుడికి) సంస్థ అధ్యకక్షులు నాగరాజు, ఎ.కె. సాహుగారు, జోనల్‌ మేనేజర్‌, సౌత్‌సెంట్రల్‌జోన్‌, హైదరాబాద్‌ (మధ్యలో) కార్యదర్శి వి. సుబ్రహ్మణ్యం ఉన్నారు.