ఎక్స్‌రే 2013 అవార్డుకు నెల్లూరుకు చెందిన కవి కె.వి. నాగేశ్వరరావు కవిత ''చైతన్య ఝరి'' ఎంపికయినట్లు అవార్డు వ్యవస్థాపకులు కొల్లూరి ఒక ప్రకటలో తెలిపారు.ప్రధాన అవార్డుతోపాటు మరో పది మందికి ఉత్తమ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్తమ కవితా పురస్కారాలు అవనిగడ్డ సూర్యప్రకాష్ (విజయవాడ) ''మహాయాత్ర'' ఈతకోట సుబ్బారావు (నెల్లూరు) ''అంటుకట్టు'', శిఖా ఆకాష్ (నూజివీడు) ''ఆధునిక గాయం'' శ్రీమతి బి. కళాగోపాల్ (నిజామాబాద్), ''అర్థం-అవనీ, జి. విజయలక్ష్మి (హైదరాబాద్) ''పాస్‌వర్డ్'', పర్కపెల్లి యాదగిరి (సిద్ధిపేట) ''వాడు'', గుర్రాల రమణయ్య (నెల్లూరు) ''మట్టితల్లి'', బండారి రాజ్‌కుమార్ (పాతమగ్ధుంపురం, వరంగల్) ''మనిషి'', జనజ్వాల (వనపర్తి) ''నాకు కూడా శత్రువు వున్నాడు''. మందరపు హైమవతి (విజయవాడ) ''వెంటాడే పీడకల'' ఈ పోటీకి 336 కవితలు వచ్చాయని, ప్రముఖ సాహితీవేత్త, అనుభూతి కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (హైదరాబాద్) న్యాయనిర్ణేతగా వ్యవహరించారని తెలిపారు.