సాహితీస్రవంతి విజయనగరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మార్చి 31న ఉగాది కవి సమ్మేళనం జరిగింది. ఎస్.వి.ఆర్. కృష్ణారావు, బాల సుధాకర్ మౌళి, పాయల మురళీకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో 47 మంది కవులు, గాయకులు కలం, గళం ద్వారా తమ భావాలను వ్యక్తీకరించారు. ధరల భారాలు, ఘోరాలు మోయలేని ప్రజలు నిరసన తెలుపుతున్నారని రెడ్డి రామకృష్ణ తన ఆధునిక పంచాంగ శ్రవణంలో తెలియజేశారు. ఆనాటి కాలంలో పంచాంగ శ్రవణం అంటే సంవత్సరంలో వచ్చే వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సంబంధిత విషయాలు ప్రజలకు తెలిజెప్పేవారని, వసంత రుతువులో వచ్చే ఉగాదిని తెలుగు వారు తొలి పండుగగా భావిస్తారని తెలిపారు. ఆద్యంతం ఉగాది కవిసమ్మేళనం ఉత్సాహంగా సాగింది.