1995 నుంచి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురిస్తున్న, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికా తెలుగు కథానిక పరంపరలో 12వ సంకలనం ఈ 2014వ సంవత్సరంలో వెలువడుతున్నదని వంగూరి చిట్టెన్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకంలో ప్రచురణార్థం గత రెండు, మూడు సంవత్సరాలలో ముద్రించబడిన ఒకటి, రెండు మంచి కథలను పరిశీలనకు పంపించమని తాత్కాలిక లేదా శాశ్వత ప్రాతిపదికపై ఉత్తర అమెరికాలో నివసిస్తున్న కథకులను కోరారు. అలాగే, సాహితీవేత్తలనూ, పాఠకమహాశయులను తమకు నచ్చిన, ఉత్తర అమెరికా నివాసులైన తెలుగు రచయితల మంచి కథలను పంపించి, లేదా సూచించి సహకరించమని ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలను ఫోన్ నెం. 83259 49054 ద్వారా తెలుసుకొనవచ్చును.