ఖమ్మం జిల్లా బూర్గుంపాడు మండలంలోని ఇరవెండి గ్రామంలో తాళ్ళూరి పంచాక్షరయ్య గృహ ప్రాంగణంలో భద్రాచలం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో గజల్ కవిగాయక సమ్మేళనం జరిగింది. ఈ కారక్రమానికి భద్రాచలం సాహితీస్రవంతి గౌరవ అధ్యకక్షులు మాల్యశ్రీ సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యకక్షులు వీధుల రాంబాబు సభాధ్యక్షత వహించారు. తాళ్ళూరి పంచాక్షరయ్య, తానా ఫౌండేషన్ ఛైర్మన్ తాళ్ళూరి జయశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభాధ్యకక్షులు వీధుల రాంబాబు మాట్లాడుతూ గజల్ ప్రక్రియ పారశీకం నుంచి వచ్చిందనీ, ఉర్దూ భాషలోకి స్వాగతింపబడిందనీ, తరువాత క్రమంగా భారతీయ భాషలన్నింటిలోకి ప్రవేశించిందనీ అన్నారు. కన్నెగంటి వెంకటయ్య తను స్వయంగా రాసి ఆలపించిన గలజ్ సభికులను ఆకట్టుకుంది. తాళ్ళూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ గజల్ కవిత్వం సరళంగా, రసాత్మకంగా ఉందని, ఇది నేటి పాఠకులకు, శ్రోతలకు ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యం వెనకపట్టుపడుతున్న థలో సాహితీస్రవంతి వంటి సంస్థలు ముందుకు వచ్చి గజల్ వంటి వినూత్న ప్రక్రియ ద్వారా సాహిత్యాభిరుచిని పెంపొందింపజేయడం ముదావహం అన్నారు. భవిష్యత్తులో భద్రాచలంలో నిర్వహించబోయే 'చైతన్య స్రవంతి' సాంస్కృతిక కార్యక్రమంలో సాహితీస్రవంతికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. టి. సిద్ధులు, చావా లక్ష్మీనారాయణ, జి.యస్. శంకరరావు, ఏగిసూర్యనారాయణ తదితర విద్యాసంస్థల ప్రముఖులు, ఉపాధ్యాయులు, మేధావులు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, ఖమ్మం జిల్లా సాహితీస్రవంతి ప్రధాన కార్యదర్శి రౌతురవి, సంపటం దుర్గాప్రసాద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాజహాన్, యం. వీరభద్రా రెడ్డి, శ్రీధిరాల వెంకటాచారి, సి. నాగేంద్ర ప్రసాద్, వర్లం, యం. పద్మావతి, సంగీత విద్వాన్ జీవన్ లు పాటలు, పద్యాలు పాడి అలరించారు. యం.వి.ఎల్. చారి వాద్య సహకారం అందించారు. బిజెఎల్‌జి. దాసు, జి.హరి నిర్వహణలో సహకరించారు. ప్రచార కార్యదర్శి జి. రామరాజు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యం అందించారు. వల్లూరిపాటి వంశీకృష్ణ ఈ కారక్రమాన్ని పర్యవేక్షించారు.- వీధుల రాంబాబు