గుంటూరు జిల్లా రచయితల సంఘం కథ, కవిత ప్రక్రియల్లో పురస్కారాలకు గాను పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఎస్.ఎమ్. సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగులో ప్రచురించిన స్వీయ వచన కవితా సంపుటులు, స్వీయ కథా సంపుటులు ఈ పోటీకి పంపించవచ్చు. 2013 జనవరి నుండి డిసెంబరు మధ్య కాలంలో ప్రచురించిన పుస్తకాలను మూడు కాపీలను జూన్ 30వ తేదీలోపు 'కోసూరి రవికుమార్, గ్రంథాలయం దగ్గర, దాచేపల్లి పోస్టు, గుంటూరు జిల్లా - 522 414 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9490776184, 9441409749 ద్వారా సంప్రదించవచ్చును.