పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు మండలంలోని పండితవల్లూరు గ్రామం శాఖా గ్రంథాలయంలో ఏప్రిల్ 30న మహాకవి శ్రీశ్రీ 103వ జయంతి సభ జరిగింది. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆచంట సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విశ్రాంత అధ్యాపకులు తోరం సూర్యనారాయణ 'మహాప్రస్థానం' విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం కమ్మ నరసింహారావు మాట్లాడుతూ ప్రజాకవిగా అణగారిన మానవాళి అభ్యున్నతికై రచించిన గేయ కవితలను విశ్లేషించారు. సభాధ్యకక్షులు మాట్లాడుతూ ప్రజల కష్టాలు, తన బాధలుగా, జీవితాంతం జనాభ్యుదయానికి తన కవితల ద్వారా శ్రీశ్రీ చైతన్యపరిచారని అన్నారు. మరికొందరు ప్రసంగించిన అనంతరం షేక్ జహీర్ వందన సమర్పణతో సభ ముగిసింది.