జాషువా పరిశోధన కేంద్రం తరపున జాషువా 118వ జయంతిని పురస్కరించుకుని కథ / పద్య కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు తెలుగు అకాడమీ సంచాలకులు కె. యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక జీవిత చిత్రణ, సామాజికత ఉన్న కథలను, పద్య కవితలను సృజనశీలురైన రచయితలు, కవుల నుండి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన కథల్లోంచి న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన 25 కథలకు బహుమతులిస్తామని, వాటినే సంకలనంగా కూడా తెస్తామని తెలిపారు. ఎంపికచేసిన యాభై పద్యకవితలతో కూడా సంకలనం తేనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 27, 28 తేదీలలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే జాషువా జయంత్యుత్సవాలలో పుస్తకావిష్కరణలు, విజేతలకు బహుమతి ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. కథలను / పద్య కవితలను జూలై 31లోపు కన్వీనర్, జాషువా పరిశోధన కేంద్రం, తెలుగు అకాడమీ, హిమయత్‌నగర్, హైదరాబాదు- 500 029 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు ఫోన్ 040-23220244 ద్వారా సంప్రదించవచ్చును. అలాగే పూర్తి వివరాల కోసం www.teluguacademy.net/pub.jpg చూడవచ్చు.