అంతర్వాహిని (నా కథ)

నా జీవిత అంతర్వాహిని, ఎప్పుడూ ఒడ్లొరుసుకొని ప్రవహించలేదు. జీలుగా - పీలగానే పయనించింది. 78 ఏళ్ళ వయసులో, 55 ఏళ్ళ వృత్తి జీవితంలోని, 20 ఏళ్ళ ప్రవృత్తి జీవితంలోని నా గురించిన సమాచారం కోసం నన్ను నేను తవ్వుకున్నాను. నా అంతరాంతరాల్లో పారాడుతున్న మధుర జ్ఞాపకాల వేడుకను, విధ్వంస జ్ఞాపకాల అగ్గినీ, బుగ్గినీ, విచ్చుకున్న సంకల్పాలను, పేర్చుకున్న సమాలోచనలను రేఖామాత్రంగా నీలితెరానంతర వెండితెరపై దర్శించాను.

- బి. హనుమారెడ్డి

బి. హనుమారెడ్డి
పేజీలు: 
182
ప్రతులకు: 
9440288080