తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మొట్టమొదటి సారిగా తెలంగాణ మహిళా కవితోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 200ల మందికి పైగా మహిళా కవయిత్రులు తమ కవితలను ఉత్సాహంగా రాసి పంపడం తెలంగాణ మహిళా కవితోత్సవానికి నిండు ఉత్తేజాన్ని నింపడమే కాదు తొలి విజయంగా భావిస్తున్నాము. ఇందులోని మేలిమి కవితలను తెలంగాణ మహిళ పేరుతో వెలువరిస్తున్నాం.
- డా|| భీంపల్లి శ్రీకాంత్
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వెల:
రూ 200
పేజీలు:
272
ప్రతులకు:
9032844017