ఒక తొలిపొద్దు మైదానంలో/ నలిగిన గడ్డిలో నీ పాదముద్రని చూశాను / గరిక్కొసన పొటమరించిన బిందువు మీద / నీ ఉనికి గంధాన్ని ఊహిస్తాను /నలిగిన గడ్డీ అణిగిన నేలా నీ /జంగమ రహస్యాన్ని లీనం చేసుకుంటాయి / నీ స్పర్శకి ఎరుపు డౌలు పడ్డ పరిసరాలన్నీ / గరిక పచ్చ చాప కింద తడి ఊపిరి / దారి పోసుకుంటూ పాకుతుంటాయి / నాకే కోకిల జొన్న గింజ కన్నులోనైనా / నీ రాత్రులే కనిపిస్తాయి / అలసిన రాత్రి నొసటన నీవద్దిన పెదాల ఆనమాలై / తెల్లవారుతుంది.
- అద్దేపల్లి ప్రభు
అద్దేపల్లి ప్రభు
వెల:
రూ 100
పేజీలు:
88
ప్రతులకు:
9848930203