ఈ విపత్కర పరిస్థితులలో ఈ దేశంలోని అన్ని సాంఘిక జన సముదాయాల మధ్యన ఉన్న స్నేహ సోదరభావం, జాతి సమైక్యత, సమగ్రతలను మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉంది. ఆ కారణంగా మన పూర్వీకులు మాతృభూమి విముక్తి పోరాటంలో ఎలా కలిసి మెలిసి ఐక్యంగా బ్రిటీష్ వలసపాలకులతో పోరాడిన చరిత్రను ప్రజల ఎరుకలోకి తేవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందులో భాగంగా ఉత్తేజకరమైన ఆప్పటి చరిత్రను ఈ పుస్తకం మనముందుకు తెస్తున్నది.
- హాజి ఫారూఖ్ షుబ్లి
సయ్యద్ నశీర్ అహమ్మద్
వెల:
రూ 25
పేజీలు:
32
ప్రతులకు:
9440241727