బదర్‌ అబాబీలు (నూతన వచన కవితా ప్రక్రియ)

వర్తమాన తెలుగు సాహిత్యం విస్తృతమైనది. అనేకానేక అస్తిత్వ ఉద్యమాలకు నిలయమిది. ఈ క్రమంలోనే భాషలోని సంక్లిష్టతను దూరం చేస్తూ జనసామాన్యానికి దగ్గరయ్యేలా కవిత్వం సంక్షిప్త రూపం దాల్చే దశ యిది. ఇటువంటి సందర్భంలో ముస్లిం కవులకు తమ సామాజిక సాంస్క ృతిక అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చైతన్యం కలిగించే ఒక నూతన వచన కవితా ప్రక్రియ అవసరం అన్పించింది. ఈ ఆలోచన కలిగిందే తడవుగా ''అబాబీలు'' అనే నూతన వచన కవితా ప్రక్రియ ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఈ ''బదర్‌''ను మీ ముందుకు తెస్తున్నాను.
- షేక్‌ కరీముల్లా

షేక్‌ కరీముల్లా
వెల: 
రూ 40
పేజీలు: 
40
ప్రతులకు: 
9441502990