ఈ స్వర్ణోత్సవ సంపుటిలో ఎంతో మంది గొప్ప రచయితలు, విమర్శకులు, సాహితీ మిత్రులు, అభిమాన పాఠకులు తమ స్పందనను ఎంతో ఆత్మీయంగా తెలియజేసారు. అంపశయ్య నవల ప్రత్యేకతలు, శిల్పం, శైలి, కథాగమనం - ఇలా అనేక విషయాలను విస్త ృతంగా విశ్లేషించారు. ఒక నవల వెలువడి 50 యేళ్ళు గడిచిన సందర్భంగా 60 మందికి పైగా లబ్దప్రతిష్టులైన రచయితలతో పాటు నారాయణ, సురేంద్ర లాంటి సామాన్య పాఠకులు కూడా ఈ నవల చదివినప్పటి తమ అనుభూతులను తెలియజేయడం అపూర్వమైన సన్నివేశం.
- డి. స్వప్న
సంపాదకులు: డి. స్వప్న
వెల:
రూ 200
పేజీలు:
298
ప్రతులకు:
040-24652387