కరోనా శాపమా? వరమా?

మనిషిలో నెలకొన్న భయాన్ని తొలగించి, మనుషుల్లో ఆశలు నింపి, కుటుంబ సంబంధాలు పరిఢవిల్లేలా కథను నడిపిస్తూ కరోనా ఉపద్రవాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ భవిష్యత్తు సుఖమయం, శుభప్రదం అవుతందన్న ఆశాభావంతో ఈ నవల వెలువరించారు పుప్పాల సూర్యకుమారి. కొద్దిరోజుల్లోనే దీన్ని పూర్తిచేయడం విశేషం. బహుశా కరోనా ఇతివృత్తంగా వెలువడిన తొలి నవల ఇదే. ఒక విజయాన్ని, విషాదాన్ని, విపత్తును, దాని అంతర్‌ స్వరూపాన్ని, స్వభావాన్ని సందర్శించిన రచయితలే ఈ సాహసం చేయగలుగుతారు.
- ముత్యాల ప్రసాద్‌

శ్రీమతి పుప్పాల సూర్యకుమారి
వెల: 
రూ 100
పేజీలు: 
182
ప్రతులకు: 
9391113756