పూల పూల వాన మంచిముత్యాల్లాంటి కవిత్వం

ఈ కవి ఉన్నతాధికారి. విధి నిర్వహణలో భాగంగా సామాన్యుల్లో మాన్యుల్లో తిరుగుతారు. వనాలను జనాలను చూస్తారు. అలాంటప్పుడు తన మనసులో రాలిన ఊహల మంచి ముత్యాలను ఇలా చిన్న చిన్న కవితలుగా అల్లారు. భావ రమణీయత దెబ్బ తినకుండా మనసును హత్తుకునే అక్షర దృశ్యాలను సృష్టించారు. పేజీకి మూడు చొప్పున మూడొందల దాకా చక్కని భావనల పూల కుప్ప ఈ పుస్తకం. .

ఏనుగు నరసింహారెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
104