నీడల దృశ్యం కవిత్వం

తెలుగు సాహితీ లోకానికి ఏనుగు నరసింహారెడ్డి కవిగా చిరపరిచితులు. పరిపాలనారంగంలో ఉన్న నర సింహారెడ్డి అవసరం కోసం కాక ఇష్టంతో రాస్తారు, కవిత్వమైనా, కవిత్వ విమర్శ అయినా, అనువాదం అయినా. గతంలో తెలంగాణా సాహిత్య అకాడెమీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టరుగా ఉన్నారు. మనసునిండా ఆర్ధ్రత నింపుకున్న కవి సమాజం పట్ల ఎంత నిబద్ధంగా ఉంటారో ఈ కవితా సంపుటిలోని కవితలు తేటతెల్లం చేస్తాయి.

ఏనుగు నరసింహారెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
128
ప్రతులకు: 
98487 87284