కవి:
హిందీ మూలం : ప్రొ|| రిషభ్‌దేవ్‌శర్మ తెలుగు సేత : పేరిశెట్టి శ్రీనివాసరావు,
సెల్ :
9989242343
ఎన్నో దెబ్బలు తిన్నాను నేను
నీ కోసం
నీ ప్రేమ కోసం
కలల్ని కన్నాను నేను,
నా వాడివవి నమ్మాను నిన్ను
ఎన్నో దెబ్బలు తిన్నానునాన్నచేతులతో,
సమాజపు చేతులతో కూడా,
సరే ! మంచిది, ఇది కూడా గొప్ప విషయమేనా...
ఆడది కలల్ని కనడం
ఆడది ప్రేమించడం
ఆడదానన్ని ప్రకటించుకొనడం !
నా ప్రతి అణువణువు రోదిస్తూ ఉన్నది
ఒక్క స్పర్శ కోసం
మరి నువ్వో
కుమ్ముతున్నావు నన్ను
మట్టనుకొని.
ఎన్నో దెబ్బలు తిన్నాను నేను
నీకోసం
నీచేతులతో !