కవి:
కె.అనూరాధ
సెల్ :
9618425243
అడవిలో మానునై
వందలేళ్ళుగా ఉన్న
నేను
ఎన్నడూ అనుకోలేదు
గొడ్డలి దెబ్బలు
తింటానని
ఈదురు గాలులు,
పెనుతుఫానులు,నెన్నింటి కోర్చి,
నా కొమ్మలు విసురుగా
కొండలను తాకి
చెంపదెబ్బలు తిన్నా.
మళ్ళీ తలెత్తి నిలుచున్నాను..!
ఎన్నెన్నో శిశిరాలు వచ్చి
నా ఆకులన్నీరాల్చినా
ఎన్నడు ఒగచలేదు (బాధ)
ఎంతో ఆశతో మళ్ళీ
కొత్త చిగుళ్ళు తొడిగి నిలిచాను
సగర్వంగా !
కరెంటు తీగలకడ్డొచ్చానని
సర్కారు వారు వచ్చి
చేతులు తెగనరికినట్లు
నాకొమ్మలు తెగ నరికినా
మళ్ళీ విశాలంగా విస్తరించాను.
కానీ కళాఖండం
కోసం
ఈ గొడ్డలి దెబ్బను
మాత్రం
తప్పించుకోలేకపోయాను.
ఖరీదైన భవంతులలో
షోకేసులలో
కొండపల్లి బొమ్మగా
ఒదిగిపోయాను !!!