అతడు... అక్కడే... సప్త సముద్రాలకీ ఆవల
శ్వేత వర్ణపు మర్రిచెట్టు తొర్రే అతని నివాసం
చేతులు మాత్రం మాగ్రామ పొలిమేరల్లో
బిగించిన పిడికిలి వికటాట్టహసం చేస్తున్నది
వేళ్ళ సందుల్లో నుండి జారిపోయిన మంచినీళ్ళునన్ను చూసి వెక్కిరిస్తున్నాయి.
ట్రాన్సపరెంట్ కన్నీళ్ళూ, రక్తవర్ణపు మట్టిలో ఇంకి
ఆకుపచ్చని మొక్కలు మొలుస్తున్నాయి
పుష్పించిన ఓ పువ్వు వాడికేసి చూసి,
వాడి కళ్ళలో మెరుపును చూసి ఆనందంతో గంతులేస్తుంది
దోరమామిడి పళ్ళ నిగనిగల్లో
తన వికృతాకారాన్ని చూసుకుని ఎంత నవ్వో
కన్నతల్లిని తొక్కేస్తున్నానన్న కోపమో, ఏమో
నా ఆక్రందనలు వినిపించుకోకుండా
మాటలన్నీ వాడి వైపే మాట్లాడుతూ.. నన్ను మాత్రం ఆటపట్టిస్తుంది.
భూమి దగ్గర నుండి పావలా అప్పు తీసుకున్న నక్క
ఎక్కడికి పారిపోగలదు.
భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వేను
నవ్వులన్నీ, పువ్వులై ఒళ్లో పడుతున్నాయి
కళ్ళతోనూ, నోటితోనూ రిమోట్ కంట్రోల్ చెయ్యగలశక్తి వాడిది
మట్టి తల్లీ నువ్వు వాడివైపేనా
పర్యావరణ మంతా మట్టి కొట్టుకుపోయింది
గాలి కలుషితమై పోయింది
వాడికేం ప్రత్యేకమైన ఆక్సిజన్ ఉంటుంది
నీరు కలుషితమై పోయింది
మినరల్ వాటర్‌తో స్నానం..
వాడెక్కడ
అతడు... అక్కడే.. సముద్రాలకి ఆవల
అతడు... అక్కడే...
కవి:
వి. వెంకట్రావు
సెల్ :
9247235401