సుఖ దుఃఖాల క్షణాలు

కవి: 
భూషి కృష్ణదాసు

చిన్న అడవి పూవుకి రూప
మివ్వడానికి రోజులు
వొకటి వెంట వొకటి వస్తాయి
సుఖదుఃఖాల్లో క్షణాలు
సముద్రపుటలల్లా ఎగిరెగిరిపడుతుంటాయి
అర్థరాత్రి పుష్పించే మొగ్గలా
ఈ అనంత అద్భుత ప్రపంచంలో
నాకు జన్మనిచ్చిన శక్తియేదో !
ఈ జీవితాన్ని ప్రేమించి నట్టే నేను
మృత్యువునూ ప్రేమిస్తాను
బ్రతుకులోని సుఖసుఖాల్లో సైతం
సముద్రంలా గంభీర ముద్ర
వహిస్తాను