కవి:
నాగేందర్
సెల్ :
9985119146
అతనిది బ్రహ్మాండమైన చదువు
బహుళజాతి కంపెనీలో ఉద్యోగం
లక్షల్లో జీతం... ఖరీదైన జీవితం
ఇంతలో అనుకోకుండా ఓ కష్టం
ఆత్మహత్యతో దానికి పరిష్కారంజీవితాన్ని ఎలా గెలవాలో
నేర్పిన చదువు
బతుకును ఎలా ఎదుర్కోవాలో
నేర్పలేదు
సముద్రం ప్రశాంతంగా ఉందని
సంతోషపడకు
భయంకరమైన మొసళ్ళు, తిమింగలాలు
కాచుకొని ఉంటాయి
దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి
చెందుతోందని ఆనందపడకు
కోలుకోకుండా దెబ్బతీసే
పెనుభారాలు పొంచి ఉన్నాయి