ఆమె

కవి: 
వి.వి. రాణి

ఆనాడు నిండు సభలో ఒకడు
ద్రౌపది చీర లాగి అవమానించడం
ఎంత నిజమో........
ఈనాడు దుర్మార్గులు నిర్భయను
చిత్రహింసలు పెడుతూ..
పైశాచిక ఆనందం పొందుతూ..
చంపేయడం అంతే నిజంఆనాడు తన మాట కోసం
కట్టుకున్న భార్యను
పరాయి వాళ్ళకు అమ్మేయడం
ఎంత నిజమో...
ఈనాడు కొందరు పురుష పుంగవులు
తన భార్య కష్టపడి పనిచేస్తుంటే...
ఆడబ్బు జేబులో వేసుకుని జల్సా చేయడం అంతే నిజం
ఆనాడైనా... ఈనాడైనా.. ఏనాడైనా...
అది ఇల్లే అయినా...
లేక ఆఫీసు అయినా..
పాలించే పాలకులు ఎవరైనా..
శారీరకంగా.. మానసికంగా..
కనపడే కష్టాలు కొన్నైతే..
కనపడని వేదనలు
ఎన్నో.. ఎన్నెన్నో ....
మనకు తెలిసిన గాథలు
కొన్నే.... కావచ్చు
వెలుగులోకి రాని నిర్భయలు ఎందరో...
తెలుసా... మీకు !