కవి:
ఆవుల బసప్ప
సెల్ :
9985922151
స్త్రీని గౌరవించాలన్న సాంప్రదాయం
మానవీయ విలువలకు నిలయమైన నేల
నేడు అత్యాచార అకృత్యాలు నిత్యకృత్యం
పసిమొగ్గల్ని చిదిమేసే మృగాళ్ళ పైశాచికత
హృదయాలను పిండేస్తుంటేఎటు వెళ్తుందీ సమాజం ?
ఎక్కడ నాటి విలువల సాంప్రదాయం ?
విలువకు పురుడు పోయాల్సిన
కుటుంబం, విద్యాకేంద్రం, పౌరసమాజం
బాధ్యతారాహిత్యం
నైతికత నేర్పాల్సిన విద్య వ్యాపారమైతే
అవి మానవత్వం, మర్యాద నేర్పే తీరికలేక
మార్కుల కార్ఖానాలలో బంధీలు
నవీనత, స్వేచ్ఛలకు ద్వంసమైన ఉమ్మడి కుటుంబం
మనుషుల మద్య అనుబంధాలు మనీబంధాలై
వ్యక్తుల బలహీనతే పెట్టుబడిగా
సినిమాలు, వ్యాపార ప్రకటనలు, అంతర్జాలం
సెల్‌ఫోన్ మెమొరి కార్డుల్లో బుసకొడుతున్న అశ్లీలత
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల్లో జోగుతున్న
ఉన్మాద ప్రపంచీకరణ మృగం
భారతీయతను ద్వంసం చేస్తున్న నగ్న దృశ్యం
అదే అత్యాచార భారతం
గరళీకరణకు బలౌతున్న భారతీయ వనిత