సైన్సు ప్రపంచం
సైన్సు ప్రపంచం
సైన్సు ప్రపంచం పిలుస్తున్నది
బిరాన దానీ
వెలుగులు చూడగ
రండీ రండీ రారండినిజం కనుటకై
ధ్వజం ఎత్తుతూ
ఎదపరదాలను తొలగిస్తూ
రండీ రండీ
వినపడలేదా
సైన్సు ప్రపంచపు తూర్యారావం
మూఢ నమ్మకపు తూటా కుదురులు
హననం చేస్తూ ముందుకు రండీ
గారడి ఊహల
గాధలు విడిచీ
అజ్ఞాన కందకం దాటండి
బానిస చాకిరి బిడారు గోడల
అధికారాలా కూల్చండి
బిరాన దానీ
వెలుగులు చూడగ
రండీ రండీ రారండి
మతములనీయల
మాయల నమ్మే
మందుల్లారా చావండి
తెలివి కిరీటం
వెలుగు కోరే
వివేకులారా రారండి
ప్రయోగనేత్రము
తెరువుడు చూడుడు
యోచనదారిని నడవండి
సైన్సు ప్రపంచం
సైన్సు ప్రపంచం
ధాత్రికి వెలుగై నిండింది
రండీ ముందుకు
రండీ దూసుకు
భావ వాదమును గిల్లేయండి
ప్రభాత రవి కిరణాలైలెండి
గతి తార్కికమను గొడ్డండ్లెత్తి
పటపట పటపట పడగొట్టేస్తూ
రండీ
రండీ
రండీ ముందుకు
కనపడలేదా సైన్సు ప్రపంచపు
సత్యజ్వాలామేధాగ్ని
దుమికి దుమికి చుట్టుకొంటున్నవి
మూఢాచారపు రోగాలు
పిడిచిపిడిచి తిమిర జ్ఞానాల్
మనమేధస్సును చంపేస్తాయీ
మలినము కడిగే మందాకాదది
మూఢభావ కాంతారం
కరవాలాలై
శలాకమ్ములై
నరికేస్తూ కదలండీ ముందుకు
బిరాన దానీ
వెలుగులు చూడక
సైన్సు ప్రపంచపు జ్ఞాననగారా
వేకువతెస్తూ మ్రోగింది
జ్ఞానులవలెనూ
సౌమ్యుల వలెనూ
వివేకశరులై సాగండి
కనపడలేదా సైన్సు ప్రపంచపు
హేతువాదముల మిలమిలలు
గతి తార్కికముల ధుమధుమలు
విజ్ఞాన జ్వాలల భుగభుగలు
సైన్సు మహాప్రస్థానం
కవి:
వల్లభాపురం జనార్ధన
సెల్ :
9440163687