కవి:
యమ్. పవన్‌కుమార్
సెల్ :
7306248364
జారేకురులు, ఎరుపెక్కిన చెక్కిళ్లతో
ఈ ప్రపంచమే హరివిల్లు అని,
అలుపెరగక తిరిగా, తెలిసిన చోటల్లా
ఈ భువి మాయని, మరో మయసభ అని తెలియదుగా!
మగ ముసుగు వేసుకొన్న మద మృగం
మరిపించెను ఆ దుశ్శాసన కార్యం
పాంచాలిని కాపాడిన కృష్ణుడు లేడు
కీచకుని వధించిన భీముడూ లేడు
శీలమే ప్రాణముగా, శీలమే పోగా ప్రాణమే విడిచెనుగా
తామసులు వెలసిన క్షణమది
సాయం కోరిన కనులు, చితిలో సమాధి అవగా
ఈ ఆత్మఘోష ఎవరికి పట్టింది?
మౌనం మంచిదే
మంచిని మింగిన ఈ తరుణాన
కరుణలేని ఈ క్షణమున
మౌనం ఇక కరగాలి
మౌనం మంచిదే
సమాజపు చివరి వలువలు విడువకముందే
పరాయి రాజ్యం వెకిలిగా నవ్వకముందే
మౌనం ఇక కరగాలి
మౌనం మంచిదే
మన ఆడపిల్లలు వెలిగే చుక్కలు
చుక్కల్లో రక్తధారలు చూడగా
మౌనమిక కరగాలి
మార్పే రాదా ! దానికి నాంది నువ్వే కారాదా
ఇక విషమే సుధగా మారదా, జగాన ప్రేమ విరియదా