కవి:
టి. వెంకటి
సెల్ :
9502653828
బక్కచిక్కిన రైతు రాజా
బరువు బ్రతుకును ఎన్నాళ్ళని మోస్తవన్నా
ఆశతో చూసి చూసి మోహం వాలిపోదన్న
అసలు వన్నెలు ఎరిగినప్పటికి
ఏరువాక సాగక పోయె
ఎట్టి బ్రతుకుల - ఆశలన్ని అడుగంటిపోయె
యింకిపోయిన - మా ఊరి చెరువల్లె
ఆరుగాలం ఆష్టకష్టమే
చలికివణుకుతు - చినుకుకు తడుస్తు
నవదాన్యపు రాశులకు - నిత్యకృషివలుడవే
గిట్టుభాటు ధరలులేక
గుండెబరువై - దిగులు బ్రతుకై
దారి తెలియని - బాటసారై
రహదారి తెలియని - పక్షివలే
చెమట చుక్కలకాల్వల్లో...
తడిసి ఆరిన తనవునీది
సాలు బరవాలు ట్రాక్టర్‌తో
దుక్కిదున్ని నట్టున్న శరీరం
కన్నీటి గ్రుడ్లు ఆకాశంలో వ్రేలాడుతుంటే నక్షత్రాలే
రంపపు కోతలా ముళ్ళచెట్లు రుధిర దారల ప్రవాహం
కడుపు వీపు ఒక్కటైన
ఎండిపోయిన పండిపోయిన
కందిపోయిన కరిగిపోయిన
అందరికి కడుపునిపే అమ్మకు తగ్గ అమ్మతనయుడర్ర ధన్యజీవి
మధ్యవర్తుల మహ్మమారులు
మరులు తెలిసిన - మాయగాళ్ళు
వలలో చిక్కిన - జింకవలే
నిత్యం భయం గుప్పిటే - నిత్య కొలిమిలా భావించే
ప్రపంచీకరణ ప్రక్రియలో
పంజరంలో చిలకవలే బందీవైతివి
బక్కి చిక్కి ఎక్కి ఎక్కి
ఏన్నాళ్ళని దౌర్భాగ్యం
ఎండిపోయిన బ్రతుకుల్లో
మండే సూర్యుడు ఉదయంచాలి
ప్రగతి వెలుగుల రధ సారధి
రైతు రాజ్యపునాదిగా
గెలుపు పిలుపు వారధిగా
నడుపు నీఎడుగుర్రాల స్వారి
ఎరుపు వనం వైపు