కవి:
జంధ్యాల రఘుబాబు
సెల్ :
9849753298
నీకిష్టమైన రంగు?
వంకాయలో నలుపు మిక్స్
అబ్బో నాకూ అదే ఇష్టం !
నీవు 'స్ప్రే' ఏది లైక్ చేస్తావు
'ఫో' జెంట్స్, మరి నీవు
'ఫో' విమిన్
అబ్బో అబ్బో ఇద్దరిదీ....
నెట్ వర్క్ ఏది?
'సూగుల్', మరి నీసంగతో
అరెరె, అబ్బో అబ్బో నేనూ అదే
మన చూపులు
మన మనసులు
మన ఇష్టాలు
అన్నీ అన్నీ కలిశాయే
థ్యాంక్స్, నన్ను రోజు డ్రాప్ చేస్తున్నందుకు
మనలో అలాంటివి ఉండకూడదు
టూ స్మార్ట్!
టూ అఫెక్షనేట్!
ఇష్టమైన వెడ్డింగ్ రింగులు
ఇష్టమైన పెళ్ళికార్డులు
పిప్పి, డుం డుం
రెండు క్యాలెండర్లు మారాయి
మనుషులతో, మనసులతో సహా
ఎందుకీ మధ్య పిక్ అప్ చేసుకోవట్లేదు
ఆఫీసులో బిజీ బిజీ
నువ్వు వీకెండ్
పార్టీలివ్వటం మానేశావ్
నువ్వు ఆ రెండు రోజులూ
కనిపించటమే మానేశావ్
స్ప్రే ఎందుకు మార్చావు
బోర్ కొట్టింది
నెట్వర్క్ 'హూయా'కు
ఎందుకు మారావు
నా నెట్వర్క్ నా ఇష్టం
నేను రోస్ట్ చేసిన బ్రెడ్ పడేస్తున్నావ్
నేను తెచ్చిన గాగుల్సు విసిరేశావ్
నిన్ను నమ్మకూడదు
నిన్నూ అంతే
నువ్వు మారావ్
నువ్వు అంతే
నువ్వు మొండివి
నువ్వు జగమొండివి
నేను వెడుతున్నా!
నేను కూడా !!