కవి:
షేక్ ఆలీబాబా
సెల్ :
94402 42736
కవిగా నువ్వు బతకాలి
రవిగా వెలుగు ముఖంతో ఎల్లప్పుడూ జీవించాలి
ఎలా దగ్గరయ్యావ్ నా హృదయానికి
తొలిసారి మాట్లాడినఆ సమయసందర్భాలేవో కలిసిన స్థలాలేవో..
చిరుగాలి సున్నితత్వమూ ఉరుము కంఠమూ
వసంతకాల పచ్చదనమూ
ఆణిముత్యమంటి మాటా నువ్వే కదూ
పగలో రాత్రో
అది పని సమయమో
రోజూ ఫోన్ చేస్తావ్
సవాలక్ష సంగతులపై ఘర్షించుకుంటామ్
చివరగా
''తెప్పలేని సముద్రానికీ పద్యం రాయని కవికీ సౌందర్యం లేదంటావ్''
పొసగనివన్నీ
పద్యంగా మార్చే శక్తినీ యుక్తినీ నిద్రలేపిన మిత్రమా
కవిగా నువ్వు బతకాలి
రవిగా వెలుగుముఖంతో భూమి - రెండువైపులకీ విస్తరించాలి
బతికితే ఒక మనిషి కవిగానూ ఒక కవి మనిషిగానూ బతకాలి