కలలు, కోరికలూ....

కవి: 
డా|| పేరిశెట్టి శ్రీనివాసరావు
సెల్ : 
09989242343

  అమాయక బాలుడు
  కలలను కంటున్నాడు
  ఎగిరే పక్షులను
  ఖైదు చేయాలనుకుంటున్నాడు తన చేతులలో
  ముచ్చటించాలనుకుంటున్నాడు వాటితో....అంబరాన నక్షత్రాలను, వెన్నెలనూ
కలపాలనుకుంటున్నాడు
తాకాలనుకుంటున్నాడు
ప్రకాశించే సూర్యున్ని
తన చిట్టి చేతులతో ఆపాలనుకుంటున్నాడు
సముద్రపు అలల్ని కూడా.....
వీడి ప్రతీ కల, కోరిక
మన ఆలోచనల కంటె భిన్నం
మనం భావించే అసంభవం
వీడు చేయానలుకుంటాడు సంభవం