నా అక్షరాలు

కవి: 
కెంగార మోహన్‌
సెల్ : 
94933 75447

  నా అక్షరాలు చైతన్య గర్భాన్ని
  చీల్చుకొస్తాయి
  వాటిని ఎప్పటికప్పుడు
  సమాజక్షేత్రంలో
  విత్తుతుంటాను
  అవి వాక్యమై, పద్యమైకవనమై పల్లవిస్తాయి
ఎదిగేకొద్ది భావాల
కరవాలాన్ని పట్టుకొని
సమసమాజ స్థాపక దిశగా
పయనిస్తాయి
క్షణమైనా విశ్రాంతి పొందక
మౌనంగానూ, వొక్కోసారి భీకరంగానూ
మానవీయ చిత్రాన్ని గీస్తాయి
నిశ్శబ్ధాన్ని చీల్చుకొని
అసమానతల్ని ప్రశ్నిస్తాయి
అత్యాచారాల్ని ఖండిస్తాయి
అంతరించిన అక్షరాలనూ
స్మరిస్తాయి
స్వరమై, గేయమై
సామాన్యుడి గుండెచప్పుడవుతాయి