కాంతిరేఖ

కవి: 
సుతారపు వెంకట్‌
సెల్ : 
98489 58690

   నడుస్తున్న  నవ్యత్వం
  చెదిరిపోని చైతన్యం
  కదులుతున్న కవిత్వం
  కాంతిరేఖ కాళోజీ
  ఓరుగల్లు వాసిగా
  ప్రజా చైతన్య లక్ష్యంగా
  పౌరహక్కుల రక్షకుడిగాకదిలినాడు కాళోజీ
ఉన్నోళ్ళు, లేనోళ్ళు
కార్మిక, కర్షకుల
చీకటి వెలుగులను
తెలియచేసినాడు కాళోజి
జన జీవన లక్ష్యంగా
మనసున్న మనిషిగా
మానవతా మూర్తిగా
మెదలినాడు కాళోజీ
ప్రగతి పథం కోసం
ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ,
పట్టుదల మనిషిగానే
ప్రవహించినాడు మన కాళోజీ