మాయాబిళ రహస్య ఛేదన
డా|| ఎ. రవీంద్ర బాబు
9394489263
పాపినేని శివశంకర్... కవి, కథకులు, విమర్శకులు, పరిశోధకులు. వారు రాసిన కథే మాయాబిళ రహస్యం. ఈ కథ గురించి కొన్ని సంగతులు..చాలా మందికి తెలిసినవే.. అయినా...
రాజ్యంలో భూములు రాజుకు, ప్రధాన మంత్రికి తెలిసే మాయమవుతుంటాయి... వాళ్లే మహామాయావితో కుమ్మక్కై ఈ దారుణాన్ని చేస్తుంటారు.
ఆ భూముల్నించి పేదలు వలసలు పోతుంటారు. సహాయ మంత్రి కుమారశేనుడు దీని గురించి ఆలోచన చేసి మొదట మాంత్రికుడు సింగప్పతో ఆ భూమాయావిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సింగప్పనే ఆ మాయావి సిసాలో బంధిస్తాడు. కుమారశేనుడు స్వయంగా వెళ్లి ఆ మాయావిని బంధించి తెచ్చి రాజుగారి ముందు హాజరు పరుస్తాడు. కాని రాజు అతను చేసేది మంచిపని అని విందు భోజనాలతో సత్కరిస్తాడు. ప్రజల బాధలను స్వయంగా చూసిన కుమారశేనుడు చివరకు వాళ్లతో కలసిపోరాడటానికి సిద్ధమౌతాడు. స్థూలంగా కథలోని వస్తువు ఇది.