sep

చీలిన పొద్దు

కంచరాన భుజంగరావు
94415 89602

ఎప్పటికప్పుడు
తలవొంపుల దృశ్యాల్లో
తలమునకలౌతూనే ఉన్నాం
కళ్ళకింది నెత్తుటి మరకల్ని
తుడుచుకోక ముందే
బొమ్మాబొరుసు వాదనలొచ్చి
చూపుల్ని చుట్టేస్తున్నారు
సోషల్‌ మీడియా వ్యూయర్ల లెక్కకు
ఒక సంఖ్యగా నమోదవగానే
నిజమేమిటో తేలని మీమాంసలో
మునిగిపోతున్నాం!

పగలూ రేయీ
పొద్దు రెండుగా చీలుతున్నట్టు
సత్యం ప్రతినిత్యం
రెండు నిజాలుగా దృశ్యమానమౌతుంది
నిజరూప నిజానికి నెత్తురూ కన్నీళ్ళు సాక్షి
నిజమని నమ్మబలికే నకిలీ వాదానికి
వంచక మూకల రహస్య గొంతుకలు సాక్షి
ఎటూ తేల్చుకోలేని పాఠకుడి మనసుకు
ఏ అలలూ పోటెత్తని నిర్లిప్త సముద్రం
ప్రతిబింబం

ఇంటినుండి బయల్దేరి
తిరిగి ఇంటికి చేరేలోపు
ఎప్పుడెక్కడ ఏమి పోగొట్టుకుంటుందో
తెలియక బిక్కుబిక్కుమనే
ఆమెను కదా అడగాలి సత్యమేమిటో ...

Pages

Subscribe to RSS - sep