వాస్తవికత పునాదుల మీద రాయలసీమ కథాసౌధం
సింగమనేని నారాయణ
నాగరికతకు మూలాధారం నీళ్లు, రాయలసీమలో లేనివి నీళ్లే. నీళ్లున్న ప్రాంతాల వాళ్లకు నీళ్లు లేని ప్రాంతాల వాళ్ల ఈతి బాధలు చెబితే తప్ప అర్థం కావు. ఒక కడివెడు నీళ్లకోసం మైళ్లకు మైళ్లు నడవాల్సి రావటం, గంటల తరబడి పడిగాపులు కాయటం,