2017

వేయి వెలుగుల వేమన

కె. ఉషారాణి
సంపాదకులు, ప్రజాశక్తి బుక్‌హౌస్‌
వేమనలా తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న కవి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. వేమన సమాజాన్ని నిశితంగా పరిశీలించిన, మానవీయత మూర్తీభవించిన కవి. ఆలోచనలోని స్పష్టత అక్షరాలలోనూ ప్రతిబింబిస్తుంది. నాలుగువందల ఏళ్ళు గడిచినా ప్రతీ తెలుగు వాడి నాల్క మీద వేమన పద్యం నడయాడుతూనే ఉంది. ఆనాటి ఆధిపత్యాన్ని, హీన సంస్కృతిని, మతోన్మాదాన్ని, కుల కుచ్చితాన్ని నిర్భయంగా ఎదిరించి నిలిచాడు. ఆడంబరాలను, డాంబికాలను, డంబాచారాల్ని హేళన చేసాడు. మరో మనిషి అటువంటి పనికి పూనుకోలేదు. పేదరికం, అవమానాలు తన నమ్మకాన్ని సడలించలేదంటే వేమన ఎంతటి ధీశాలో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజాశక్తి బుక్‌హౌస్‌ సాంస్కృతిక తిరోగమనం వేగం పుంజుకున్న ఈ రోజు వేమన్న వెలుగులు ఆ తిరోగమనాన్ని అడ్డుకుంటాయని ఆశిస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో వేమనపై 14 పుస్తకాలు వెలువరించడం జరిగింది 

Pages

Subscribe to RSS - 2017