sep

మన ఊరి సోనూసూద్‌

ఉదయమిత్ర
89196 50545
''ఊరంతా
భయంకర దశ్యాలతో
మునిగిపోయిన తర్వాత
అతను నెమ్మదిగా, ప్రశాంతంగా
అంటుకడుతుంటాడు.''
- బాల సుధాకర్‌ మౌళి
ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద కారు రర్యు న దూసుకుపోతోంది. వర్షం వెలిసి ఎండ కొడుతుండడంతో చెట్లు తలార బోసుకున్నట్లున్నాయి. పేరు తెలువని చెట్లు, భాష తెలువని యాసలో పాడుకుంటూ, ఆదివాసి నాట్యంలాగా, లయబద్ధంగా ఊగుతున్నాయి.
ఙఙఙ
వెనుక సీట్లో మిత్రులు ఇద్దరు ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ లోకం వాళ్లది .నేను మెల్లగా డ్రైవర్తో మాటలు కలిపాను
మనం వీళ్లను డ్రైవర్లే అనుకుంటాంగానీ, కడుపునిండా ఎన్నెన్ని కథలో. కదిలిస్తే గాని బయటికి రావు.
''నాయక్‌ ..నీకు సొంతం కారు ఉండేదట కదా .ఎప్పుడైనా లాంగ్‌ టూరు పోతుంటివా ''అన్నాను మాటల్లోకి దింపుతూ.
''ఓ ..మస్తుగా వోయిన సార్‌ .తిరుపతి ,తమిళనాడు, కేరళ, కన్యాకుమారి ఇట్లా మస్తు తిరిగిన సార్‌'' అన్నాడు హుషారుగా కారును పోనిస్తూ.

Pages

Subscribe to RSS - sep