జీవన తాత్వికతను ఒంపుకున్న చిన్ని చిన్ని సంగతులు
సురగౌని రామకృష్ణ
79897 23820
''ప్రజల కవివై గొంతు, రగిలించి పాడితే ఒక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి లోకాలనూగింపరా! ఓ కవీ! శోకాల తొలగింప రా'' అంటూ కవి చైతన్య దీప్తిలా నిలవాలని దిశానిర్దేశం చేశారు తాపీ ధర్మారావు గారు. ''అబద్ధాలాడడమంత సులభం కాదు సుమా! కవిత అల్లడం'' అని దాశరథి కృష్ణమాచార్యులు గారన్నట్టు వాస్తవాలను కవిత్వం చేయడంలో కవికీ నిబద్ధత ఉండాలి.