కవిత్వం జీవధాతువులాగా ఉండాలి
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
ఇప్పుడు అన్ని ప్రక్రియలూ నువ్వా నేనా అన్నట్టు సాంఘిక ప్రసార మాధ్యమాల్లో హౌరెత్తుతున్నాయి. అందువల్ల పద్యమైనా, వచన కవిత్వమైనా దేనికీ ఢోకా లేదన్నారు ప్రముఖ కవి, రచయిత, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడెమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. కవి, రచయిత డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 'సాహిత్య ప్రస్థానం' తరఫున వారితో ముచ్చటించారు. ఆ ముఖా-ముఖి ఇదీ....
మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి.