కాలం చెప్పుడు మాటలు వినదు
చందలూరి నారాయణరావు
97044 37247
కాలం తోక పట్టి
కలతల్ని కణితకి గురిపెట్టి
నిప్పులాంటి నిజాల్ని కక్కిస్తే
నెత్తుటిలో ఉడికిన ఆశలు
నిజాయితిని కలబోసుకుని
నుదుటి రాతలై మొలిస్తే ...
కాళ్ళు మొలిచిన ఆచరణ కళ్ళు తెరచి
విశ్వాసంతో చేతులు కట్టుకుని
అడ్డంగా కాళ్లు జాపిన కొండల్ని నరికి
నడక కింద పడేకేసిన పల్లేరులను పీకేసి
ఆశను కళ్లలో కుక్కోని అడుగులు వేస్తుంటే
చెమటలు పట్టిన దారి
పాదాలకు వంగి నమస్కరించి ...