2023

నీ కృప చాలును

కెంగార మోహన్‌
94933 75447
వరండాలో విరిగి కట్లుకట్టిన పడక్కుర్చీ మీద పడుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు ఈశ్వరప్ప. మనసు విరిగి బతుకు కకావికలమై బతుకుతున్నోడికి ఈ పడక్కుర్చీకున్న కట్లొకలెక్కా! నీతిగా బతుకుతున్నోడు. సహకార శాఖలో ఈశ్వరప్ప నిజాయితీని అధికార్లెవరూ జీర్ణించుకునేవారు కాదు. సహకార శాఖ పరిధిలో నడపబడుతున్న సహకార బ్యాంకు ద్వారా నడిచే సహకార సొసైటీకి కార్యదర్శి ఈశ్వరప్ప. ఆ సొసైటీ అధ్యక్షుడు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు. అదే ఊరిలో ఉన్న ఓ నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకమైన వ్యక్తి. ఆ నాయకుడి అనుచరుడే సొసైటీ అధ్యక్షుడు. అతడు చెప్పిందే అక్కడ అమలయ్యేది.

Pages

Subscribe to RSS - 2023